సురక్షిత సమాజానికి మార్గదర్శక సూత్రాలు

ఆస్తులకు సంబంధించిన  తగాదాలు/నేరాలు  

1 లాభంకోసం ఖూనీ
2 దోపిడి
3 దొంగతనం మరియు దోపిడి
4 ఇల్లుకు కన్నంవేయుట
5 ఇల్లు దొంగతనం మరియు దోపిడి
6 గుంజుకుపోవడం
7 వాహనాల దొంగతనం
8 పశువుల దొంగతనం
9 తీగ  దొంగతనం
10 జేబులు కొట్టడం

పౌరులందరిని జాగ్రత్తపరచటం
ప్రతి పౌరుడు తన సొంత ఆస్తులను తమదైన పద్ధతిలో రక్షణ కల్పించుకోవాలి.  నేరస్థుడికి అవకాశం, లక్ష్యం కలసి వచ్చినపుడు ప్రమాదం ఎక్కడైనా ఎప్పుడైనా ఎవరికైనా తలపడవచ్చు.

ఇది ఎలా జరుగుతుంది:

లాభంకోసం ఖూని:

  • నేరస్థులు వారి నేర ప్రయత్నాలను నిరోధించే చర్యలను ఎదుర్కంటే హింసకి పాల్పడుతారు.

  •  అపరాధం చేసేప్పుడు వాళ్ళు ప్రజల్ని చంపడం వరకు వెళ్ళగలరు. గావ్ పార్దిలు,  వల్ పార్దిలు (మహారాష్ట్ర నుండి), శాంచీ మోచీలు(ఉత్తరాదినుండి) తెలగపాములు మరియు ఎర్రగొల్ల(అం.ప్ర. నుండి) వంటి నేర ముఠాలు ప్రజలను వారి ప్రక్కవారిని భయభ్రాంతులను చేయడానికి ఏమాత్రం ప్రతిఘటన లేకున్నా హింసకి పాల్పడుతారు.
  • ఈ నేరాలు సాధారణంగా వ్యవసాయక్షేత్రాలూ, నిర్మానుష్య ప్రదేశాలలో జరుగుతాయి.
     
  • సాధారణంగా , ఈ ముఠాలు ఆ ప్రాంతాన్ని చుట్టూ సునిశితంగా సందర్శించిన తర్వాత నేరాలకు సన్నద్దులవుతారు

డెకాయిటీ (దోపిడి):

  • ఇది జనావాసాలలో, పొలాల్లో, ప్రధాన రహదారుల్లో, వ్యవసాయ క్షేత్ర గృహాల్లో, ప్రభుత్వ రవాణా వ్యవస్థ బస్సుల్లో, రైళ్ళల్లో, పెట్రోల్ బంకుల్లో, బ్యాంకుల ఎటిఎంలల్లో జరగవచ్చు.
  • ఎక్కువగా ఈ నేరాలు రాత్రిళ్ళు ఆయుధం (ఏదేని ఒక ఆయుధం) ధరించిన కనీసం 5 మంది సభ్యులుగల ముఠాతో జరగవచ్చు.
  • కొన్ని పేరొందిన ముఠాలు (ఆం.ప్ర.) నుండి స్టూవర్టుపురం, బిట్రగుంట,  యెరుకల, ఎర్రగొల్ల, తెలగపాముల, వడ్డెర, లంబాడ మొదలయిన ముఠాలు (ఆం.ప్ర.) నుండి, పార్దిలు (మహారాష్ట్ర నుండి), శాంచీ మోచీలు(ఉత్తరాదినుండి) ఇటుక తయారీ కార్మికులు (భారత్ లోని అన్ని ప్రాంతాల నుండి).

ఇల్లుకు కన్నంవేయుట

  • ఇల్లు కొల్లగొట్టడం   పగలు లేదా రాత్రి.

  • కిటికిలు, గ్రిల్ గేట్లు, లేదా ద్వారాలు తెరిచే పరిస్థితి కల్పించడం.

  • తాళం కప్పలు, ఇనుప గేట్లు లేదా జాలీలు కోయడం.

  • పాల్స్ సీలింగ్ లేదా వెంటిలేషన్ ద్వారాల ద్వారా పైకప్పులో లేదా గోడలలో కన్నాలు వేయటం.

  • పొరుగువారి అనాక్రమిత ఇల్లు మరియు షాపుల ద్వారా ప్రవేశం పొందడం.

  • తాళాలు పగలుకొట్టడం లేదా

    ఇంటి దొంగతనం మరియు దోపిడి :

  • నిర్లక్ష్యంవల్ల పగలు లేదా రాత్రి. సంభవం.

  • ఉదాహరణకి   పనిమనుషులు, బంగారుపూత, అని వచ్చేవారు, రిపేరు చేసేవాళ్ళు, సేల్స్ రిప్రజంటేటివ్స్, సర్వే నిర్వహించేవాళ్ళు, బాబాలు మరియు సాధువులు దొంగతనం చేసే అవకాశం ఉంది.


  • స్నాచింగ్:
  • పగలు లేదా రాత్రి ఎక్కడైనా ఎప్పుడైనా జరగవచ్చు.

  • ఏదైనా విషయం గురించి మాట్లాడటం లేదా సహాయం పొందడం అనే నెపంతో బాధితుడి దగ్గరకు రావటం.

  • బాధితుల వెనుక నుండి హేండ్ బాగులు లేదా మెడలలోని ఆభరణాలు లాక్కు పోవడం.

    దృష్టి మళ్ళింపు చేయటం:
  • నేలమీద డబ్బులు పడెయ్యడం లేదా బట్టలు చించటం మరియు తిండి లేదా పానియాలు ఆశ చూపడం.

    మోటారు వాహనాల దొంగతనం:
  • కారు యజమానులు లేదా డ్రైవర్లు వారి వాహనాల దగ్గర లేనప్పుడు, నిర్మానుష్య పార్కింగ్< ప్రదేశాలు, గ్యారేజీలు, అపార్టుమెంట్లు, జనసమూహాలు మరియు విక్రయ కేంద్రాలు వాహనాల దొంగతనాలకు అనువైన ప్రదేశాలు

  • ఈ నేరస్తులు దొంగతాళం సహాయంతో తాళం వేసిన వాహనాలను కూడా దొంగిలిస్తున్నారు .

  • పార్కింగ్ స్థలములలో కూడా జరుగవచ్ఛు

     పశువుల దొంగతనం:
  • సాధారణంగా దొంగతనం వ్యవసాయక్షేత్రాలలో లేదా పశువులు ఒకచోట నుండి మరోచోటికి రవాణా అయ్యేటప్పుడు.
  • లంబాడా మరియు కిరాయి హంతకులు ఈ రకమైన నేరాలకు పేరొందినవాళ్ళు.

    తీగల దొంగతనం :
  • ఎపి ట్రాన్స్ కో మరియు దూరవాణి శాఖలు ఉపయోగించే తీగలు దొంగిలించబడతాయి. వ్యవస్థీకృత నేర ముఠాలు సాధారణంగా సర్వీస్ వైర్లను దొంగిలిస్తారు. ఈ దొంగతనాలు నివాస ప్రాంతాలకు దూరంగానే జరుగుతాయి

    డిక్కీ నేరాలు:
  • ద్విచక్ర వాహనాలు లేదా ఇతర వాహనాల డిక్కీల్లోంచి విలువైన వస్తువులు మరియు ధనము దొంగతనం చేయడాన్ని డిక్కీ నేరాలని చెప్పవచ్చు. బ్యాంకుల దగ్గర మరియు వ్యాపార నిలయాల వద్ద, విద్యా సంస్థలవద్ద, రిజిస్ట్రేషన్ కార్యాలయాల వద్ద డబ్బు తీసే వాళ్ళు మరియు డిక్కీలో డబ్బు దాచే వాళ్ళపైన నేరస్తులు ఒక కన్నేసి ఉంటారు.

  • నేరస్తులు వాహనాలను వెంబడించి అవి పార్క్ చేయబడగానే వాటిలోని విలువైన మరియు ధనాన్ని దొంగిలిస్తారు.

    జేబుదొంగల రహస్యాలు:

    వ్యాపారం, కంపెనీలు మరియు సంస్థలు ఎన్నో రహస్యాలను కలిగి ఉంటాయి. అలాగే జేబుదొంగల వారి రహస్యాలు  చదవండి.

    ఎప్పటిలాగే, రహస్యాలు ఎప్పటికీ రహస్యంగా ఉండవు. జేబుదొంగలు వారి కార్యకలాపాలు ఎలా చేస్తారు అనే దానిపై పోలీసులు సమాచారాన్ని సంపాదించారు. వాటిలో కొన్ని రహస్యాలు ఇక్కడ ఉన్నాయి. పోలీసులు జేబుదొంగతనం జరగకుండా ఉండడానికి కొన్ని సూచనలు ఇచ్చారు.

    తీసుకోవలసిన ముందు జాగ్రత్తల :

    గుంపులో ఉన్నవారు, బహిరంగంగా డబ్బును తీసుకెళ్ళేవారు, ప్రత్యేకంగా ఎవరైతే వారి డబ్బును ప్రదర్శిస్తారో అటువంటి వారు జేబుదొంగలు బారిన పడే అవకాశం ఉంది

    ధనరహిత లావాదేవీల  కోసం నెట్ బ్యాంకింగ్ మరియు ఎటిఎంలను ఉపయోగించండి.

    జేబుదొంగలు ఉద్దేశపూర్వకంగా గుంపులో ఉన్న ఒక అనుమానించని వ్యక్తి పైకి పడటం లేదా తోయటం చేస్తారు. అలా మీకు జరిగితే మీ పర్సు లేదా హాండ్ బాగ్ తక్షణం చూసుకోండి.

    జేబుదొంగతనం చేసేప్పుడు ప్రతి ఒక్కరి దృష్టి మళ్ళించడానికి వాళ్ళు అలజడి సృష్టిస్తారు. అటువంటి పరిస్థితులల్లో జాగ్రత్తగా ఉండండి.

    వేలాడే హ్యాండ్ బ్యాగులు ఉన్నవారిని ఎన్నుకుంటారు. స్త్రీలు వారి బ్యాగులు చేతిలో గట్టిగా పట్టుకోవాలి

    పర్సులను ప్యాంట్ల వెనుక జేబులలో, లేదా చొక్కా జేబులలో పెట్టుకునే వ్యక్తులకు ప్రాధాన్యమిస్తారు.

        కాబట్టి మీరు మీ పర్సులను మీ ప్యాంట్ల పక్క జేబులలో ఉంచుకోండి

    మీరు మీ యింటిని వదిలి వళ్ళేటప్పుడు తీసుకోవలసిన ముందు జాగ్రత్తలు

    ముందు జాగ్రత్తలు :

    కొంచెం సేపైనా మీరు యింట్లో లేకపోతే అన్ని తలుపులకూ, కిటికీలకు తాళం వేయండి.

    పెద్ద మొత్తంలో వున్న ధనాన్ని బ్యాంకులలోను, ఖరీదైన ఆభరణాలను సేఫ్ డిపాజిట్ లాకర్లలోను ఉంచుకోండి.

    యింటి బయటి పరిసరాలలో తాళం చెవులను దాచవద్దు.

    మీరు మీ యింట్లో లేనప్పుడు ఆ విషయాన్ని ప్రకటిస్తూ ఎటువంటి నోటీసులు వదలకండి.

    యింట్లో మనుషులు ఉన్నట్లు తెలియడానికి రాత్రిళ్ళు రేడియో, ఒక లైటును ఆన్ చేసి ఉంచండి.

    మీరు మీ యింటి నుండి దూరంగా ఉన్నప్పుడు వార్తా పత్రికలు, సంచికలు మొదలైన వాటిని ఆపించేయండి.

    ఏదైనా తాళంచెవి పోయిన యెడల అన్ని తాళములను మార్చివేయండి

    సెక్యూరిటీ అలారం విధానాన్ని అమర్చండి
    అది పని చేసి విధంగా చూసుకొండి.

    మీ యింటిని ఓ కంట కనిపెట్టమని మీ పొరుగు వారికి చెప్పండి.

    మీ చేతి ఫోనును అందుబాటులో ఉంచుకోండి.

    మీరు సెలవుల మీద వెళ్ళేముందు మీ దగ్గరలోని పోలీస్ స్టేషన్లో (ఎన్పిపి) చెప్పి వెళ్ళండి.

    గ్రిల్ గేట్స్ కు అన్ని వేళలా తాళం ఉంచడి.

    కొత్తవారికి ఎప్పుడూ గేట్లు తెరవకండి. తలుపుకున్న అద్దంలోనుండి వచ్చిన వారిని చూసి, మీరు వారితో మాట్లాడేటప్పుడు తలుపుకున్న గొలుసు గడియ వేసి మాట్లాడండి.

    వచ్చిన వారు మంచివారిగా కనిపిస్తే తరువాత తలుపుకు వేసిన గొలుసు గడియను తెరవండి. అవసరమైతే ఆ కొత్త వ్యక్తి ఏ కంపెనీ లేదా ఏ సంస్థ నుండి వచ్చాడో దానికి ఫోన్ చేసి నిర్ధారించుకోండి. మీ టెలిఫోన్ పుస్తకం నుండి మాత్రమే ఆ కంపెనీ  లేదా సంస్థ  ఫోను నంబరు తీసుకోండి. మీకు ఆ వ్యక్తిమీద అనుమానం కలిగితే 100 నంబరుకు ఫోన్ ద్వారా పోలీసులను  సంప్రదించండి.
    ఎప్పుడూ పోలీసులు, స్థానికులచే గస్తీలను నిర్వహించండి

    తెలిసిన నేరస్తులు, అనుమానితులు, దేశదిమ్మర్లు, కొత్తవారు, వీధిపిల్లలు మొదలైన వారి కార్యకలాపాలు, కదలికల మీద నిఘా ఉంచండి.,

    కొత్తవారు మిమ్మల్ని అనుసరిస్తున్నప్పుడు, లిఫ్టులో ప్రయాణిస్తున్నప్పుడు జాగ్రత్తగా ఉండండి.

    లిఫ్టులో అనుమానితులుగా ఉన్న కొత్తవారితో మాట్లాడకండి.

    విలువైన నగలు ధరించటం, పెద్ద మొత్తంలో డబ్బును తీసుకు వెళ్ళటం వంటివి చేయకండి.

    మిమ్మల్ని అనుసరిస్తున్న, మీ ధ్యాసను మరనిస్తున్న వ్యక్తులపట్ల జాగ్రత్తగా ఉండండి.
    మీ చేతి సంచిని మీ ముందే ఉంచుకోండి. లేదా మీ మోచేతికి తగిలించుకోండి

    మీరు లేకుండా వాటిని విడిచిపెట్టవద్దు. ముఖ్యంగా జనసమ్మర్దం అధికంగా ఉండే దుకాణాలు మరియు సంచార వ్యాపార కేంద్రాల వద్ద జాగ్రత్తగా ఉండండి

    సరైన ప్రదేశంలో వాహనాలను నిలపండి .

    మీరు కొంతసేపయినా వాహనం విడిచి వెళ్లేటప్పుడు ఇగ్నీషన్ కీని తొలగించండి.

    విలువైన వస్తువులను మీ వాహనాలలో వదలకండి .

    వాహనాలు కిటికీలు, తలుపులు ఎప్పుడు మూసి ఉంచండి .

    విండ్ స్ర్కీన్ మీద వాహనం యొక్క రిజిస్ట్రేషన్ నంబరు వేయండి.

  • All Rights Reserved ® Cyberabad Police Commissionerate