కంట్రోల్ రూమ్‌కి ఆటోమెటిక్‌గా కనెక్ట్ అయ్యే
100 / 9490617100 లేదా 27853412 లేదా
27853418 కి ఫోను చేయండి. మీ దగ్గరలోని
పోలీసు స్టేషనులో మీరు స్వయంగా మీ ఫిర్యాదును మౌఖికంగా గాని లిఖిత
పూర్వకంగా కానీ నమోదు చేయవచ్చు. నేరాన్ని
నమోదు చేసేటప్పుడు మీ సంతకంతో కూడిన వ్ర్రాతపూర్వక ఫిర్యాదు అవసరమౌతుంది .
నేరాన్ని ఫిర్యాదు చేయటం
ఎలా ?
లిఖితపూర్వకంగా లేదా
మౌఖికంగా
మీ దగ్గర్లోని పోలీస్ స్టేషన్లొ
(ఫిర్యాదును కేసుగా రిజిస్ట్ర్రేషన్ చేయదలచినచో సంతకంతొ కూడిన
వ్రాతపూర్వక ఫిర్యాదు తప్పనిసరి.)
మీ దగ్గరలోని పోలీసు స్టేషన్ వివరాలు
పొందడం ఎలా?
సైబరాబాద్ వెబ్‌సైట్‌లోని
మీ పోలీస్ స్టేషన్ వివరాలు అనే లింక్ ని క్లిక్ చేయండి.
మీ సంబందిత పోలీస్ స్టేషన్ వివరాలు తెలుసుకోండి .
నేరాన్ని ఫిర్యాదు చేయటం ?
దగ్గర్లోని పోలీస్ స్టేషన్‌కు కానీ, పోలీస్ కంట్రోల్ రూం కాల్‌సెంటర్‌కు
ఫోను ద్వారా
లేదా SMS (9640100100) ద్వారా నేరాలను
ఫిర్యాదు చేయవచ్చు. మీ ప్రాంతంలో పగలూ రాత్రంతా గస్తీ తిరిగే
పెట్రోలింగ్ అధికారులకు కూడా ఫిర్యాదు
చేయవచ్చు.
ప్రమాదాల విషయంలొ ఫోన్‌ద్వారా
కూడా ఫిర్యాదు చేయవచ్చు మరియు ప్రమాదాల విషయంలో ఫోలీస్ స్టేషన్‌లో కానీ,
న్యాయస్థానంలో కానీ సాక్షిగా ఉండేదీ లేనిదీ నిర్ణ్‌యించుకునే స్వేచ్చ
ఫిర్యాదీకి ఉంది.
ఇప్పటి వరకు ఏ పౌరుడైనా
ప్రమాదాన్ని, దానికి సంబందించిన సమాచారాన్ని ఫిర్యాదు చేయాలనుకుంటే,
సాక్ష్యమివ్వడానికి పోలీసుస్టేషనుకు, న్యాయస్థానానికి తిరగాల్సి
వస్తుందని, అసౌకర్యానికి గురికావాల్సి వస్తుందని భయపడి ముందుకు
రాకుండా తప్పించుకుంటున్నారు. ఇప్పుడు సైబరాబాదు పోలీసులు ఒక కొత్త
ఆలోచనతో ప్రజల అసౌకర్యం నివారించటానికి ముందుకు వచ్చారు.
* ప్రమాదాలను ఫిర్యాదు చేయవలసి వస్తే,
ఫోను ద్వారా కాల్‌సెంటర్‌ను గాని (నెం.100/9490617100)
లేదా SMS (9640100100) ద్వారా దగ్గరలోని పోలీసు స్టేషన్‌ను
గాని సంప్రదించండి. * ఫిర్యాదు
చేసిన లేదా సమాచారం అందించిన వ్యక్తి సాక్షిగా పేర్కొనబడడు
ఎందుకనగా పౌరులు తమ విధిగా సమాచారాన్ని పి.యస్.కు అందించినపుడు
వ్యక్తిగతంగా వారికి ఏలాంటి అసౌకర్యం కలుగజేయడం ఉండదు.
పౌరుల ద్వారా ఫిర్యాదు చేయబడిన ఏరకమైన నేరమైనా సంబంధిత అధికారుల చేత
దృవీకరించబడుతుంది. అక్కడ నుంచి సంబంధిత అధికారులు సమస్యను సాద్యమైనంత
త్వరలో పరిష్కరిస్తారు సైబరాబాద్ పోలీస్ స్టేషన్‌లు దర్యాప్తు యొక్క
పురోగమనాన్ని ఫిర్యాదుదారీ/బాధితులకు ఎప్పటికప్పుడు తెలియపరచే విధంగా
పారదర్శకంగా ఉంటాయి.
మీ కేసు యొక్క దర్యాప్తు స్థాయిని
---
మీ కేసు
యొక్క దర్యాప్తు స్థాయి అనే లింక్ క్లిక్ చేయుట ద్వారా తెలుసుకొనవచ్చు స్త్రీలకు, పిల్లలకు సంబంధించిన
సున్నితమైన అంశాల విషయాలలొ పోలీసులు వారిని పోలీసు స్టేషనుకు పిలవకుండా
వారే ఆ స్థలాన్ని సందర్శించి, సమస్యలను విచారించి వాటిని
పరిష్కరిస్తారు.
|